నాగర్ కర్నూల్,(సిరా న్యూస్);
జిల్లా పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకమని, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల కేంద్రఎన్నికల సాధారణ పరిశీలకులు సతీష్ కుమార్, మిథితీష్ మిశ్రాలు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం మైక్రో అబ్జర్వర్లకు ఓటింగ్‌పై శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా నాగర్ కర్నూల్
సాధారణ పరిశీలకులు మితిలీష్ మిశ్రా మాట్లాడుతూ…..
స్వేచ్ఛగా, సజావుగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంతో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో ప్రతిఅంశాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలన్నారు. మైక్రో అబ్జర్వర్ల పాత్ర ప్రతి దశలో నిర్ణయాత్మకంగా ఉంటుందన్నారు.జిల్లాలోని 210 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రోఅబ్జర్వర్లు ను ఎన్నికల సంఘం నియమించిందన్నారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించవలసి ఉంటుందని అన్నారు. పోలింగ్ రోజున ఉదయం 5.30 కి మాక్ పోలింగ్ నిర్వహణఅలాగే మాక్ పోలింగ్ 50 ఓట్లు వేశారా లేదా పరిశీలన చేయాలని సూచించారు.29వ తేదీ రోజునే మికు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ముందుగా పోలింగ్ కేంద్రాల మౌలిక వసతులను పరిశీలనచేయాలని సూచించారు.
30వ తేదీ పోలింగ్ రోజున ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ ప్రక్రియ నుంచి పూర్తి సాయి పోలింగ్ పూర్తి అయ్యేవరకు సూక్ష్మస్థాయిలో పరిశీలన చేసిన అంశాలనుఅనెక్సర్ 28 లో నమోదు చేసి అదే రోజు రాత్రి రిసీవింగ్ సెంటర్లో నేరుగా జనరల్ అబ్జర్లకు అందజేయాలని సూచించారు.
పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభం కావాలని ఏదైనా కారణాలతో ఉదయం 8గంటల వరకు కూడా వెంటనే తమకు తెలియపరచాలన్నారు.
ఏదైనా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకుంటే అట్టి పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
మాకు పోలింగ్ ప్రారంభమయ్యేప్పటినుండిపోలింగ్‌ప్రారంభం అయినప్పటి నుంచి ఈవీఎంలను తరలించేవరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మైక్రో అబ్జర్వర్ల విధులు, బాధ్యతలను ఆయన అవగాహన కల్పించారు. కొల్లాపూర్ అచ్చంపేట నియోజకవర్గాల
మరో సాధారణ పరిశీలకులు సతీష్ కుమార్ మాట్లాడుతూ……
మైక్రో అబ్జర్వర్ల పోలింగ్ రోజున పోలింగ్ బూత్ లో జరిగే పోలింగ్ ప్రక్రియను పరిశీలన చేయడానికి నియమించడం జరుగుతుందని, బూత్ లో ప్రతిఅంశాన్ని పరిశీలన చేయాలని సూచించారు.