సిరా న్యూస్, అదిలాబాద్:
దివంగత మాజీ మంత్రివర్యులు సి రామచంద్రా రెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సంజీవరెడ్డి తెలిపారు. టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డిసిసి మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ లతో కలిసి అదిలాబాద్ జిల్లా, బేల మండలం జునుని, సదల్పూర్, చాంద్ పల్లి, చప్రాల, సొన్ కాస్, సాంగిడి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక్కసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అదిలాబాద్ ను అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.