వేములవాడ,(సిరా న్యూస్);
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈనెల 26న వేములవాడ పట్టణంలో జరగనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు.ఈ క్రమంలో సీఎం పాల్గొనే సభాస్థలిని బుధవారం బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు,స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు,ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ క్రమంలో బాల నగర్ కోర్ట్ సమీపంలోని సభా ప్రాంగణంతో పాటు హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు.నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులతో చర్చించారు.వారి వెంట జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమా, మున్సిపల్ ఛైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు, ఎంపీపీ జవ్వాజి రేవతి-గణేష్ లతో పాటు కౌన్సిలర్లు, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.