సిరా న్యూస్, ఖానాపూర్:
సీసీ కెమెరాలతో నేరాలకు చెక్: సీఐ సైదారావు
నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయని ఖానాపూర్ సిఐ సైదారావు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో స్థానిక పట్టణ వర్తక సంఘం అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ… సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. పాత కెమెరాలను రిపేర్ చేయించి, కొత్త కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు చేసేవారు సైతం భయపడి నేరాలు నియంత్రణలోకి వస్తాయని అన్నారు.
Your blog post was a great read! I found the content to be informative and relevant. To explore further on the topic, click here. Thanks for sharing your insights!