సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన తొంట ఇంద్రసేను..

సిరా న్యూస్, సైదాపూర్:

సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన తొంట ఇంద్రసేను

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగీర్ పల్లి గ్రామంలోని బీసీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా జాగిరిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తొంట ఇంద్రసేను మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. జాగీర్ పల్లి బీసీ కాలనీలో రూ.10 లక్షల తో సీసీ రోడ్డు మంజూరు చేసినందుకుగాను రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ దొంత సుధాకర్, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గుండారపు శ్రీనివాస్, నాయకులు సొల్లు వైష్ణవ్, కంకణాల చంద్రారెడ్డి, కొండ మల్లయ్య, కస్తూరి సమ్మయ్య, గుడిసె భాస్కర్, ఆవుల శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గుంటి కుమార్, రెడ్డబోయిన కుమార్, బోళ్ల సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *