సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలి..

సిరా న్యూస్, ఖానాపూర్:

సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలి..

కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్..

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఆ పార్టీ నిర్మల్ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. ఆదివారము ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఐదు గ్యారంటీల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను తప్పక అమలు చేస్తామని అన్నారు. తప్పుడు మాటలు విని ప్రజలు మోసపోవద్దని, తమ విలువైన ఓటును హస్తము గుర్తుకు వేయాలని కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సమ్మీ, కార్యకర్తలు సూరినేని మల్లేష్, మహేంద్ర విలాస్ చారి, సయ్యద్ జమీర్, బి రాజేందర్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *