గుంటూరు,(సిరా న్యూస్);
సరదాగా పార్కులో గడపడానికి వచ్చిన అమ్మాయిల మధ్య చోటుచేసు కున్న ఓ చిన్న వివాదం కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులో ఇటీ వలే కొత్తగా ప్రారంభించిన గాంధీ పార్కులో ఈ ఘటన జరిగింది. అక్కడ ఓ లొకేషన్ వద్ద సెల్ఫీలు, రీల్స్ తీసుకునేందుకు యువతులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో వారు జుట్లు పట్టుకుని ఘోరంగా కొట్టుకున్నారు. పలువురు అడ్డుకునే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు.