స్మృతి వనం ఏర్పాటుకి తీర్మానం… కలెక్టర్ రాహుల్ రాజ్

సిరా న్యూస్ ఇంద్రవెల్లి

స్మృతివనం ఏర్పాటుకు తీర్మానం కలెక్టర్ రాహుల్ రాజ్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ సూచనల మేరకు ఇంద్రవెల్లి  అమరవీరుల స్థూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు ప్రతిపాదనలు  సిద్ధం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.  అమరవీరుల స్తూపం వద్ద గ్రామ సభ ఏర్పాటు చేసి కలెక్టర్ మాట్లాడారు. స్తూపం వద్ద ఒక ఎకరం పరిధిలో అందమైన స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఇక్కడ స్మృతి వన ఏర్పాటుకు గ్రామసభ తీర్మానం కూడా తీసుకున్నామని దీన్ని ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించడానికి వచ్చే ఏప్రిల్ 20 లోపు ఇక్కడ స్మృతి వనాన్ని పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ డిపిఓ  , కిషన్ డి ఆర్ డి ఓ పీడీ  , దిలీప్ కుమార్ ఐ టి డీ ఏ  , ట్రైబల్ వెల్ఫేర్ డీడీ, ప్రవీణ్ స్థానిక తాహసిల్దర్, పోటే శోభా బాయి, ఎంపీపీ, అర్క పుష్పాలత జెడ్పీటీసీ ,కోరేంగ గాంధారి సర్పంచ్ గణేష్ థహరే ఉపసర్పంచ్ ఆదివాసి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *