హైదరాబాద్.(సిరా న్యూస్);
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం శుకరవారం నాడు కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లోని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు. ఇప్పటికే అలంపూర్ నియోజక వర్గం నుంచి బిఆర్ఎస్ కు చెందిన నలుగురు జెడ్పిటిసిలు, ముగ్గురు ఎంపీపీ లు పలువురు ఎంపీటీసీ లు, సర్పంచులు కాంగ్రెస్ పార్టీ లో చేరిన విషయం తెలిసిందే.
పోలింగ్ కు మరో వారంరోజులే వున్న సమయంలో బీఆరెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం షాకిచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ తనకు ఆలంపూర్ టికెట్ ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్న అబ్రహం కు ఏఐసిసి కార్యదర్శి, ఆలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ సంప్రదింపులు జరిపారు. తన గెలుపు కోసం సహకరిస్తే భవిష్యత్ లో మంచి అవకాశాలు ఇస్తామని ఒప్పించారు. దీంతో నేడు లాంచనంగా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు..