రోడ్ సేఫ్టీ సమావేశ నిర్ణయాలను పాటించి ప్రమాదాలు జరగకుండా చూడాలి…
జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు….
సిరా న్యూస్,కర్నూలు;
జిల్లా రోడ్డు భద్రత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేసి ప్రమాదాలను నివారించాలని మరియు హిట్ అండ్ రన్ ప్రమాదాలపై అధికారులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు సంబంధిత అధికారులను కోరారు.
కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలు చేయడం జరిగిందో వాటిపై సమగ్రంగా చర్చించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
*ఈ సందర్భంగా డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ… గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని అమలు అయినవని ఇంకా మిగిలినవి చేయవలసి ఉందని జిల్లా రెవెన్యూ అధికారికి తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయం దగ్గర స్పీడు బ్రేకర్ల ఆవశ్యకత ను గత సమావేశంలో చర్చించగా అవి ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
*యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రతినిధి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ హిట్ అండ్ రన్ ప్రమాదాలలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉన్న వాహనం చే ప్రమాదం జరిగినట్లయితే మృతి చెందిన వ్యక్తి యొక్క వయస్సు , అతని మీద ఆధారపడ్డ వ్యక్తులు మరియు అతని నెలసరి ఆదాయము వంటివి పరిగణలోకి తీసుకొని ఇన్సూరెన్స్ మొత్తము దాదాపు 25 లక్షలు దాకా వస్తుందని తెలియజేశారు .కావున ప్రతి వాహనదారుడు వాహనంకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కల్పించుకుని… ఈ విషయంపై సంబంధిత అధికారులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించాలని డిటిసి కి సూచించారు.తాసిల్దారులకు ఈ విషయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించు చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.