సిరా న్యూస్, ఖానాపూర్:
హోళీ పండుగ సంబరాలల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజర సత్యం..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హోలీ పండుగ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హోలీ పండుగ సందర్భంగా రంగుల బండిని ఏర్పాటు చేసి ప్రధాన రహదారుల గుండా హోలీ ఆడుతూ నృత్యాలు చేస్తూ ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు కుర్మా శ్రీనివాస్, కిషోర్ నాయక్, నాయిని సంతోష్, కో ఆప్షన్ సభ్యులు బండారి కిషోర్, హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.