సిరా న్యూస్, ఆదిలాబాద్:
టార్చ్ కు ఓటేయండి… మీ జీవితాల్లో వెలుగులు నింపుతాం…
+ ధర్మసమాజ్ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అగ్గిమల్ల గణేష్ మహారాజ్
టార్చ్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆదిలాబాద్ లో అభివృద్ధి చేసి చూపిస్తానని ధర్మసమాజ్ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అగ్గిమల్ల గణేష్ మహారాజ్ అన్నారు. అదిలబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పూల మాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. డప్పు వాయిద్యాలు, మంగళ హారతులు నడుమ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు చేసింది ఏమీ లేదన్నారు. డబుల్ బెడ్ రూంలు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజీపీ పార్టీలు కూడా ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రతి ఒక్కరు టార్చిలైట్ గుర్తుకు ఓటు వేసి, తనను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.