1952లో లక్ష… ఇప్పుడు 40 లక్షలు పదింతలైన అసలు ఖర్చు

సిరా న్యూస్,హైదరాబాద్;
స్వతంత్ర భారత దేశంలో 1952లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యవయ పరిమితి కేవలం రూ.లక్షగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికలను అత్యంత ప్రభావితం చేసే అంశం డబ్బు. ఇది ఎవరూ కాదనలేరు. ఈ నేపథ్యంలోనే డబ్బు విచ్చలవిడిగా అభ్యర్థులు ఖర్చు పెట్టకుండా ఎన్నికల సంఘం పలు నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నియమావళి ప్రకారం బరిలో నిలిచిన అభ్యర్థులు నిబంధనలు అనుసరించి వ్యయపరిమితి గరిష్టంగా రూ. 40 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ వ్యయ పరిమితి తొలినాళ్లలో రూ. లక్ష మాత్రమే ఉండగా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఇప్పుడు రూ.40 క్షలకు చేరింది.స్వతంత్ర భారత దేశంలో 1952లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యవయ పరిమితి కేవలం రూ.లక్షగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మొత్తంలోనే అభ్యర్థులు ఖర్చు చేసేవారు. నేటి తరహాలో ఇంత ఖర్చు, డబ్బుల పంపిణీ కూడా ఉండేది కాదు. దీంతో అప్పుడు రూ.లక్ష భారీగా అనిపించింది. తర్వాత 1962 నాటికి వ్యయ పరిమితి రూ.3లక్షలకు, 1971 ఎన్నికల్లో రూ.4 లక్షలకు, 1975 నాటికి రూ.5 లక్షలు చేరింది. 1984లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా రూ.10 లక్షలకు చేరగా, 1991 నాటికి రూ.12 లక్షలకు పెంచారు. ఆతర్వాత 1999లో రూ.15 లక్షల 2004 నాటికి రూ.17 లక్షలు, 2009లో రూ.26 లక్షలు, 2014లో రూ.28 లక్షల వ్యయపరిమితిని నిర్ణయించారు. 2018లో రూ.35 లక్షలు ఉండగా, ఇది ప్రస్తుత ఎన్నికల్లో రూ.40 లక్షలకు చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *