సిరా న్యూస్,న్యూ డిల్లీ ;
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మరోసారి అధికారం చేపట్టింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. మోదీ సహా 72 మందితో కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో మోదీ 3.0 కేబినెట్ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో కేబినెట్ మంత్రులు సమావేశం కాబోతున్నారు.ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద 2 కోట్ల అదనపు గృహాలను ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారులకు అందించే సాయాన్ని దాదాపు 50 శాతం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
=============