సిరాన్యూస్, ఆదిలాబాద్
నేరడిగొండలో మైనర్ బాలుడు పై అత్యాచారం
* నిందితుడికి జైలు శిక్ష, పదివేల జరిమానా
* పోక్సో కోర్టు జడ్జి డాక్టర్ పి శివరాం ప్రసాద్
మైనర్ బాలుడు పై అత్యాచారం చేసిన నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, పదివేల జరిమానా పోక్సో కోర్టు జడ్జి డాక్టర్ పి శివరాం ప్రసాద్ విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2021 జూన్ 2న ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ గ్రామానికి చెందిన బాలుడు (8) అక్కతో ఇంటి లో మట్టితో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలుడు వద్దకు సమీప బంధువైన శివరాత్రి మహేష్ (30) వెళ్లి బాలుడిని కిరాణా షాపుకు వెళ్లాలి అని తన ఇంటికి తీసుకెళ్లాడు. చాలాసేపటికి తన తమ్ముడు తిరిగి రానందున అక్క ఇంటికి వెళ్లి చూడగా , బాలుడిని బట్టలు విప్పి శివరాత్రి మహేష్ అసహజ పద్ధతిలో లైంగిక వాంఛ తీర్చుకోనుచుండగా అనుమానంతో పారిపోయాడు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి నేరడిగొండ ఎస్సై భరత్ సుమన్ కేసును సెక్షన్ 377 ఐపిసి, సిక్స్ పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితుడిని రిమ్స్ ఆసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ కేసులో అప్పటి డిఎస్పి ఎన్ ఉదయ్ రెడ్డి విచారణ జరిపి సాక్షులను సేకరించి చార్జిషీటు దాఖలు చేయగా, ప్రత్యేక పిపి ఎన్ రమణారెడ్డి 11 మంది సాక్షులను విచారించి కేసు రుజువు చేయగా బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి , అదనపు జిల్లా న్యాయమూర్తి అగు డాక్టర్ శివరాం ప్రసాద్ తీర్పు వెలువరిస్తూ నేరస్థుడికి 20 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష, రూపాయలు 10,000 జరిమానా విధించారు. ఈ కేసులో సిడిఓ బిఎస్ గౌతమ్ అబ్దుల్ అహ్మద్ సాక్షులను సమయానికి కోర్టులో హాజరు పరచగా, బాధితునికి రూపాయలు ఐదు లక్షల నష్టపరిహారం అందించాలని న్యాయ సేవ అధికార సంస్థకు ఆదేశించారని లైసెన్ అధికారి పండరి తెలిపారు.