సిరా న్యూస్, ఆదిలాబాద్ రూరల్:
2003-04 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం…
అదిలాబాద్ రూరల్ మండలం యాపలగూడ ప్రభుత్వ పాఠశాల 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సదర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. అందరూ ఒక్క చోటుకు చేరి, బాల్యం నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడిగా గడిపారు. ఆనాడు కలిసి చదువుకున్న వారంతా ప్రస్తుతం అనేక రంగాల్లో రాణిస్తూ ఉన్నతంగా ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తోటి సహచరుల్లో ఇద్దరు ఆర్మీలో సేవలందిస్తూ ఉండగా, వారిని ఘనంగా సన్మానించారు.