3 ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ వారి వితరణ

గోయంకా డిగ్రీ కళాశాలకు ఐదు లక్షలు విలువ చేసే పది కంప్యూటర్లు ఉచితంగా పంపిణీ
సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని గోయంక డిగ్రీ కళాశాలలో ఉన్న లాబ్ కు 3 ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా 10 కంప్యూటర్లను ఉచితంగా పంపిణీ చేశారు. దీనికి సుమారు ఐదు లక్షలు వ్యయం అయినట్లు స్వాభిమాన్ ఫౌండేషన్ వారు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా 3 ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ డైరెక్టర్ సీమ గొయంక హాజరయ్యారు. ఆమెకు కళాశాల సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఆమె కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కళాశాలలో 3 ఎఫ్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ఆమె రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి సీమ ప్రసంగించారు. విద్యార్థులకు ఎంతో ఉదారంగా ల్యాబ్ లో కంప్యూటర్ లు ఉచితంగా పంపిణీ చేసిన 3 ఎఫ్ స్వాభిమాన్ ఫౌండేషన్ వారికి డిగ్రీ కళాశాల యాజమాన్యం వారు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో 3 ఎఫ్ అప్ప అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఏడి జే ఓ వేమల శ్రీనివాస్, ఫౌండేషన్ సిబ్బంది, గోయంక కళాశాల ల్యాబ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు. ఇంగ్లీష్ లెక్చరర్ ఇందిరమ్మ, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *