సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల జిల్లా అవుకు మండలం సంగాపట్నం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పిడుగు పడి 32 గొర్రెలు మృతి చెందాయి. సంగపట్నం గ్రామానికి చెందిన ఎరుకలి వెంకటేశ్వర్లుకు చెందిన 32 జీవాలు మేత మేసేందుకు కొండ ప్రాంతానికి వెళ్ళాయి. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే గొర్రెలు మృతి చెందాయి.మృతి చెందిన గొర్రెల విలువ దాదాపు 3 లక్షలు ఉంటుందని బాధిత గొర్రెల యజమాని వెంకటేశ్వర్లు వాపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారాన్ని అందజేయాలని గొర్రెల యజమాని బాధను వ్యక్తం చేశారు.