– పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్
సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గం, చేబ్రోలు గ్రామపంచాయతీ లో సర్పంచ్ రాందే లక్ష్మి సునీత అధ్యక్షతన జరిగిన గ్రామసభలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని “గ్రామ వికాస పత్రాన్ని” రూపొందించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం – వైయస్సార్సీపి నాయకుల ఉపాధి హామీ పథకంగా జగన్మోహన్ రెడ్డి మార్చి వేశాడని అన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం పంపిన రూ,,36,000 వేల కోట్ల నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి తన సొంత అవసరాలకు వాడుకుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద వచ్చిన 36000 వేలకోట్లు – వైయస్సార్సీపి నాయకుల జేబుల్లోకి వెళ్లినాయి. ఉపాధి హామీ నిధులు రూ,, 36000 వేల కోట్లను దిగమింగిన వైయస్సార్సీపీ నాయకులతో ఆ డబ్బులు కక్కిస్తామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు చేయించాలి.
గ్రామపంచాయతీల నిధులు దొంగిలించి, గ్రామాల అభివృద్ధి కుంటూ పడేలా చేసిన వైయస్సార్ ప్రభుత్వం కనుమరుగవ్వడం ఖాయమని అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు కడలి గోపాలరావు, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పాలడుగు లక్ష్మణరావు, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ సలహాదారులు పిల్లి సత్తిరాజు, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతుల అన్నవరం, రామ సింగవరం సర్పంచ్ అడపా శ్రీనివాస్, గోకవరం సర్పంచ్ నెక్కలుపూడి సురేష్ బాబు, సర్పంచ్ సంది ప్రభావతి సూర్యచంద్రరావు, శనగన రాంబాబు, సర్పంచులు డి.అలకనంద, బి. సింధు, పి. రాధ, కె. సత్యన్నారాయణ, సీహెచ్. శ్రీకాంత్, ఉపసర్పంచ్ దుర్గా భవాని, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు వై వినోదరాజు, ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్క ధనుంజయ యాదవ్ తదితరులు పాల్గొన్నారు