ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాము..

+ ప్రతిపక్ష హోదాలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాము..

మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న

సిరా న్యూస్, అదిలాబాద్:
ప్రజా తీర్పును శిరసావహించి, ప్రతిపక్ష హోదాలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామనీ తాజా మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామ శాఖ అధ్యక్షునిగా ప్రారంభమైన తన రాజకీయ జీవితం సర్పంచిగా, మండల అధ్యక్షునిగా, 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని అన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు ఎంత సేవా చేసిన రుణం తీర్చుకోలేనిది అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బీఆరెస్ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని, ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతించాలని అన్నారు. ఇకనుంచి ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *