సిరా న్యూస్,బద్వేలు;
గోపవరం మండలంలోని పి.పి కుంట గ్రామానికి చెందిన సిపిఎం నాయకుడు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో 40 కుటుంబాలు సిపిఐ లో చేరినారు. వీరికి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పార్టీ కండువాలు మెడలో వేసి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ….. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ కావాలని నినదించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమే అని ఈనాడు సిపిఐ చేస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులై ప్రజా సంఘాలైన వ్యవసాయ కార్మిక సంఘం, డిహెచ్పిఎస్, ఇన్సాఫ్ సంఘాలలో చేరారని ఆయన తెలిపారు. గోపవరం మండలంలో వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ అది కొంతమంది భూ బకాసురుల చేతుల్లో ఉందని అరకొర ప్రభుత్వ భూమి ఉంటే అయ్యా మాకు ఇల్లు లేవు భూములు లేవు అని ప్రభుత్వ భూమిలో ఎర్రజెండా పార్టీ పేదలు ఆక్రమిస్తే రెవిన్యూ పోలీస్ అధికారులు కడుపులో మండి ఆగమేఘాల మీద గుడిసెలను తొలగించి అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని పేదలకు ఇంటి స్థలం ప్రభుత్వ బంజర భూమి దక్కేంతవరకు సిపిఐ అవిశ్రాంత పోరాటం చేస్తుందని ప్రజలందరూ ఎర్రజెండా నాయకత్వంలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతూ ఈ దేశంలోనే మొట్టమొదటిగా ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ త్వరలో శతాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకోవాలని అలాంటి పార్టీలో ప్రజాసంఘాలలో మీరు చేరడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు సిపిఐ ప్రజాసంఘాల చేరిన వారిలో… ఆకా చంద్రశేఖర్, స్వామి దాసు, బాలసుబ్బయ్య, షేక్ సర్దార్ వలి, పెద్దపోలుపెంచలయ్య, ట్యాంక్ మస్తాన్, మాబు, ఖాజావలి, సుబ్బారెడ్డి, చేరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీర శేఖర్ ఏరియా సహాయ కార్యదర్శులు చంద్రమోహన్ రాజు, పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య ఏరియా కార్యవర్గ సభ్యులు బాలు, పీవీ రమణ, జి ఎల్ నరసింహ, నాగేష్ మహిళా సంఘం నాయకురాలు సలోమి, డిహెచ్పిఎస్ నాయకులు మునిరత్నంపాల్గొన్నారు