సిరా న్యూస్,తిరుపతి;
:ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం జగన్ కు ప్రజలుగా మనం రుణ పడిపోయామని తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తిరిగి సీఎంగా జగన్ ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు
:తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ఇసుకేసినా రాలనంతగా మైదానం జనసంద్రంగా మారింది. తిరుపతి రూరల్ మండలంలోని 2,061మహిళా సంఘాల సభ్యులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహిత్ రెడ్డికి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.
శ్రీ పద్మావతీ అమ్మవారి పాదాల చెంత.. సాక్షాత్తు అమ్మవారు మీ రూపంలో ఈ సభకు తరలివచ్చినట్టుందని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మహిళలను ఉద్దేశించి అన్నారు. 4వ విడత వైఎస్సార్ ఆసరా రూ.24.09 కోట్ల నిధుల చెక్కును మహిళా సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడారు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ.మేరకు మహిళా సంఘ సభ్యులకు వైఎస్సార్ ఆసరా పథకం అమలు చేస్తూ మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ఆసరా నిధులతో మహిళల్లో ఆర్థిక భరోసా కల్పించారని వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలంలో ఇప్పటి వరకు రూ. రూ.94.55 కోట్ల నిధులు వైఎస్సార్ ఆసరా పథకం కింద పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రతి గడపలో ఆర్థిక భరోసా కల్పించి.. మెరుగైన జీవన విధానానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగులు వేశారన్నారు. విద్యార్థి దశ నుంచి పండు ముదుసలి వరకు అన్ని వర్గాల వారు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందారన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు కలగా మిగిలిన పక్కా ఇళ్లును నిర్మించి చరిత్ర సృష్టించారన్నారు. ప్రతి పల్లె అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని తెలిపారు. సచివాలయం వ్యవస్థ తో ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువైందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకే చేరుస్తూ వారధిగా నిలుస్తున్నారని తెలిపారు. రైతులకు ఉపయుక్తమైన రైతు భరోసా కేంద్రం, ప్రజా రోగ్యానికి దోహదం చేసేలా ప్రభుత్వ ఆసుపత్రులను అందుబాటులోకి తెచ్చారని వివరించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను సొంత కుటుంబంలా భావించి సేవలందించారని గుర్తు చేశారు. మా నాన్న అడుగు జాడల్లో నడుస్తూ.. ప్రజలకు నిరంతరంగా అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలిపారు. 2024 ఎన్నికల్లో తనను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. అంతకుముందు స్వయం సహాయక సంఘ మహిళలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. సీఎం జగన్ ను, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సేవలను ప్రశంసించారు. నేడు మా కుటుంబాల్లో వీరు వెలుగులు నింపారని కొనియాడారు.
తిరుచానూరులో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ జెండా ఆవిష్కరణ అత్యంత వేడుకగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయం నుంచి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు ర్యాలీగా సాగారు. పంచాయతీ కార్యాలయంలో అభివృద్ధి, సంక్షేమం కు కేటాయించిన నిధుల తో కూడిన బోర్డ్ ను మోహిత్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ ప్రతినిధులు, ఎంపీపీ యశోద, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఇతర అధికారులు తదితరులు
పాల్గొన్నారు.