సిరా న్యూస్, ఆదిలాబాద్:
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు..
వంద రోజుల్లో ఆరోగ్యారంటీలు అమలు చేసి తీరుతామని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన నాగపూర్ సన్నాహక సమావేశ కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలు అమలు చేసిందని గుర్తు చేశారు. త్వరలోనే మిగిలిన నాలుగు హామీలు సైతం అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ నాయకులు బద్నాం చేసేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో నీటిపారుదల, విద్యుత్ శాఖ లపై విడుదల చేసిన శ్వేత పత్రంతో బిఆర్ఎస్ తెల్ల ముఖమేసిందని అన్నారు. స్వేద పత్రం పేరిట తెలంగాణ ప్రజలకు తప్పుడు లెక్కలు చెప్పి మరోసారి మోసం చేసేందుకు బిఆర్ఎస్ చూస్తుందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ 2 కోట్ల ఉద్యోగాల హామీ అమలులో ఘోరంగా విఫలమైందని అన్నారు. మత రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం తప్ప బిజెపి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. కాగా మహారాష్ట్రలోని నాగపూర్ లో ఈనెల 28న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ వేడుకలకు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
Superb article…