సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
మనిషి తన బ్రతుకుతున్న ప్రపంచాన్ని ఎంత నాశనం చేస్తున్నారో ఈ ఒక్క ఘటన చూస్తే అర్థం అవుతుంది.చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కనీస స్పృహ కూడా లేకుండా ప్రజలు జీవిస్తున్నారు.పట్టణ ప్రాంతాలలో ప్యాస్టిక్ బ్యాగ్లు వస్తువులు వాడకం విపరీతంగా పెరిగిపోయింది.బజారులలో పారివేయడంతో మూగజీవాలు వాటిని తిని ఆనారోగ్యానికి గురవుతున్నాయి.ఈ కోవలోనే ఎమ్మిగనూరు పట్టణం నందు ఒక ఆవు ఆనారోగ్యంకు గురికావడంతో న్యాయవాది తిమ్మప్ప అనే న్యాయవాది గమనించారు. అయన పశువైద్యాధికారి సుబ్రమాణేశ్వరాచారి దృష్టికి తీసుకువెళ్లగా పశువైద్యులు వీరేష్, నరేంద్రనాథ్ రెడ్డిలు పరీక్షించి ఆవుకు శస్త్రచికిత్స చేశారు.ఆవు కడుపు నుంచి దాదాపు 70 కేజిల ప్లాస్టిక్ వస్తువులు,ఇనుప కడ్డిలు ఇతర వస్తువులు తీశారు.ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.