ప్రజాపాలనను సద్వినియోగం  చేసుకోవాలి -స్పెషల్ ఆఫీసర్ శంకర్..

సిరా న్యూస్,బేల: 
ప్రజాపాలనను సద్వినియోగం  చేసుకోవాలి
-స్పెషల్ ఆఫీసర్ శంకర్..

ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ శంకర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఆయన ఇతర అధికారులతో కలిసి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు ఇబ్బంది కలగకుండా 15 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం 193 వినతి పత్రాలు అందయనీ, మొత్తం దరఖాస్తులు 1476 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, తహశీల్దార్ సవైసింగ్, ఫీల్డ్ అసిస్టెంట్ అతుల్, కారోభారీ డి గజానన్, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శిలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *