సిరా న్యూస్,హనుమకొండ;
ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. హసన్ పర్తి పెద్ద చెరువు వద్ద ఘటన జరిగింది. బస్సు వరంగల్ నుండి కరీంనగర్ వెళుతోంది. ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బస్సులో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల్లో ఒక గర్భవతి వుంది. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.