సిరా న్యూస్,ఇంద్రవెల్లి:
విద్యార్థులు పట్టుదలతో చదవాలి…
– హైమన్ డార్ప్, బెట్టి ఎలిజిబెత్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు దుర్వ సంతోష్
+ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణి…
పట్టుదలతో కష్టపడి ఉన్నత చదువులు చదవాలని ప్రొఫెసర్ హైమన్ డార్ప్, బెట్టి ఎలిజిబెత్ స్మారక గ్రంథాలయ వ్యవస్థాపకులు దుర్వ సంతోష్ అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలోని యుపీఎస్ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేదరికంతో చదువులు మధ్యలోనే ఆపకుండా పట్టుదలతో, ఇష్టంగా చదవాలన్నారు. ఉన్నత చదువులు చదివితేనే సమాజంలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. విద్యార్థులకు తనవంతుగా సహాయ సహకారాలు అందించడానికి ఏళ్లవేళల సిద్ధంగా ఉంటానని అన్నారు.