Education is Divine: చదువుతోనే సమాజంలో గౌరవం…

సిరా న్యూస్, భీంపూర్‌:

చదువుతోనే సమాజంలో గౌరవం…

నేటి సమాజంలో చదువుతోనే ప్రతీ ఒక్కరికి ఉన్నతమైన గౌరవం లభిస్తుందని డ్రీమ్‌ సొసైటీ మేనేజర్‌ లక్ష్మణ్‌ అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం రాంపూర్‌–బి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతీ ఒక్క విద్యార్థి చిన్నతనం నుంచే స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకొని ముందుకుపోవాలన్నారు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు సైతం రాయడం, చదవండం, సంతకం చేయడం నేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *