మంత్రి బుగ్గనకు టిక్కట్ డౌటే

సిరా న్యూస్,కర్నూలు;
నియోజకవర్గాల్లో ఎదురీదుతున్న అభ్యర్థులను మార్చేందుకు అవకాశం ఉంటే ఇతర నియోజకవర్గాలకు మార్చేందుకు సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాలుగా 38 మంది చోట్ల ఇంచార్జులను మార్చారు. మూడో జాబితాపై విస్తృత కసరత్తు నిర్వహిస్తున్నారు.తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పలు జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు, నేతలు వస్తున్నారు.
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ ఇంఛార్జి నియామకంపై సీఎం కసరత్తు చేస్తున్నారు. డోన్ ఎమ్మెల్యే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సీఎంవోకి పిలిపించారు సీఎం. అక్కడ బుగ్గనకు ఎదురుగాలి వీస్తోందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయనను సీఎంవోకు పిలిపించడం ఆసక్తికరంగా మారింది. ఆయనను మారిస్తే.. పార్లమెంట్ కు పంపుతారా లేకపోతే.. వేరే నియోజవకర్గం నుంచి టిక్కెట్ ఇస్తారా లేకపోతే.. ఎమ్మెల్సీ ఇస్తారా అన్నదానిపై ఇంకా చ్రచలు జరుగుతున్నాయి. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. వీరితో పాటు రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ చంద్రశేఖర్, ఎంపీ మార్గాని భరత్ లు క్యాంప్ ఆంఫీసులో చర్చలు జరుగుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ఇంఛార్జి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇంఛార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. నందికొట్కూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు స్థానం కావడంతో బైరెడ్డి అక్కడి నుంచి పోటీ చేయలేరు. కానీ ఆయన తాను చెప్పిన అభ్యర్థికే టిక్కెట్ ఇవ్వాలంటున్నారు.అయితే సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యే అర్థర్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జి నియామకం పై కూడా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, మార్కాపురం జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డిలకు పిలుపు వచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇరువురితో హైకమాండ్ చర్చిస్తోంది. మరోవైపు.. విజయనగరం పార్లమెంట్ ఇంఛార్జి నియామకంపై కూడా కసరత్తు చేస్తున్నారు. సీఎంఓ పిలుపుతో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అనంతరం సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.విశాఖ లోక్ సభ స్థానం నుంచి బొత్స సత్యనారాయణ సతీమణి పేరును వైసీపీ ప్రచారంలోకి తెచ్చింది. గతంలో విజయనగరం నుంచి ఎంపీగా బొత్స ఝాన్సీ గెలిచారు ఇప్పుడు విశాఖ నుంచి పరిశీలిస్తున్నారు. అయితే ఈ అంశంపై తనను ఎవరూ సంప్రదించలేదని.. తనతో ఎవరూ మాట్లాడలేదని.. బొత్స సత్యనారాయణ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *