సిరా న్యూస్,రంగారెడ్డి;
రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం బాకారం గ్రామ రెవెన్యూలో ఉన్న డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన మంటలలో కాలుతున్న బాడీ ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే వరకు మృతదేహం కాలుతూవుంది. మంటలు ఆర్పీ దర్యాప్తు చేస్తున్నారు మొయినబాద్ పోలీసులు. మృతదేహం పక్కన సగం కాలిన ఫోన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. చంపి ఇక్కడ తీసుకొచ్చి తగులబెట్టారా లేక ఇక్కడే హత్య చేసి తగులబెట్టారా అనే వివరాలు దర్యాప్తులో తెలియాల్సివుంది.