సిరా న్యూస్,సికింద్రాబాద్..;
బేగంపేట్ లో మారుతి ఓమ్ని వ్యాన్ లో మంటలు చెలరేగాయి.. రహదారి పక్కనే నిలిపి ఉన్న ఓమ్ని వాహనంలో ఒక్కసారిగా మంటలు రావడంతో అందులో ఉన్న డ్రైవర్ అప్రమత్తమై వాహనంలో నుండి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది..వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.. అయితే అప్పటికే అగ్ని ప్రమాద దాటికి ఓమిని వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది.. స్కూలు విద్యార్థులను తీసుకువెళ్ళే వాహనంగా అగ్ని మాపక అధికారులు తెలిపారు..ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..