వైసీపీని నిలువరించకపోతే ఎన్నికల్లో హింస

ఈసీకి పవన్ ఫిర్యాదు

సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి విజయవాడలో ఈసీని కలిసిన ఆయన పలు అంశాలపై ఉదాహరణలతో ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఈసీకి వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్‌… ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్రానికి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుందన్నారు జనసేనాని. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా దిగజారిపోయిందని విమర్సించారు. ప్రతిపక్షాలను ప్రశ్నించే వారిని ముఖ్యంగా జనసేన, టీడీపీ నేతలపై ఎలా కేసులు పెట్టి వేధిస్తున్నారో తెలియజేశారు. ఎన్నికల నాటికి తమకు కావాల్సిన అధికారులు ఆయా పదవుల్లో ఉండేలా వ్యూహాన్ని రెడీ చేశారని ఇప్పుడు అదే అమలు చేస్తున్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది రాజ్యాంగ విరుద్ధమైన వ్యవస్థ అని.. దాన్ని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని పవన్ సూచించారు. ఇలాంటి వాటిన్నింటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టకపోతే హింస పెరిగిపోతుందని కూడా పవన్ తెలియజేశారు. స్థానిక ఎన్నికల్లో ఏ స్థాయిలో హింస జరిగిందో వివరించాం. కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా అప్పుడు లేకుండా పోయిందని వాపోయినట్టు తెలిపారు. ఈసారి ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు ఉంటాయని పవన్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *