సిరా న్యూస్,కమాన్ పూర్;
రామగిరి మండలం సెంటనరీ కాలనీలో నేడు భవన నిర్మాణ కార్మికుల సమైక్య సంఘం జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి తన సొంత ఖర్చులతో వలస కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. తద్వారా స్వామిమాట్లాడుతూ….. తమ ప్రాంతాలలో ఉపాధి లేక పొట్టకూటికోసం వలస వచ్చిన కార్మికులు చిన్నచిన్న కుటీరాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారని, వీరికి తగు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు,వీరిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు. వీరికి తాగునీరు, కరెంట్, మరుగుదొడ్ల, సౌకర్యం కల్పించారన్నారు. నిర్మాణ కార్మికులందరూ లేబర్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకోవాలన్నారు. కార్డు ద్వారా కలిగేప్రయోజనాలను కార్మికులకు వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు బైరి శంకర్, వెంగళ రాములు, లక్ష్మయ్య, పాల్గొన్నారు