సిరా న్యూస్, ఆదిలాబాద్:
సికిల్ సెల్‌పై ఆవగాహణ పెంచుకోవాలి…
+ హెల్త్ సూపర్వైజర్ బొమ్మెత సుభాష్
+ మామిడి కొర్రిలో ఉచిత వైద్య శిభిరం
+ 79 మంది రక్త పరీక్షలు
ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా సికిల్‌సెల్ వ్యాధిపై అవగాహణ పెంచుకోవాలని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ బొమ్మెత సుభాష్ అన్నారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ రూరల్ మండలంలోని గిరిజన ఆదివాసీ గ్రామమైన మామిడి కొర్రిలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 79మందికి సికెల్‌సెల్ రక్తపరీక్షలు నిర్వహించారు. 41మంది పలు మందులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికెల్సెల్ను గుర్తించడంతో, అవసరమైన చికిత్స తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు పవార్ ప్రేమ సింగ్, ముయ్యాల మోతి, రోహిదాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.