సిరా న్యూస్,హనుమకొండ;
హనుమకొండ నగరంలోని కాళోజి జంక్షన్ నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు పలు నాలాలపై షాపింగ్ మాల్ యజమానులు అక్రమంగా నిర్మించిన సైన్ బోర్డులను మునిసిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం తొలగించారు. ఫుట్ ఫత్ పై నిర్మించిన చిరు వ్యాపారస్తులకు దుకాణాలను తొలగించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న నాలాలపై సైన్ బోర్డులు నిర్మించడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల ప్రజల ఫిర్యాదు మేరకు సైన్ బోర్డులను తొలగిస్తున్నామని మున్సిపల్ అధికారులు వెల్లడించారు