సిరా న్యూస్,హైదరాబాద్;
జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ బుధవారం ఓల్డ్ సిటీ లో పర్యటించారు. నాంపల్లి నియోజక వర్గం లో వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ తో కలిసి వివిధ పనులను పరిశీలించారు. శానిటేషన్, ఇంజనీరింగ్,టౌన్ ప్లానింగ్, యస్ ఎన్ డి పి పనులను పరిశీలించారు. అఘాపూర్ కల్వర్టు, మల్లేపల్లి మహమూద్ హాస్పిటల్ , తాజ్ నగర్ డ్రైన్, జీబ్రా డ్రైన్ వర్క్ ,బల్కపూర్ నాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ నాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మిగిలిపోయిన భూసేకరణ పనులను పూర్తి చేసి రిటైనింగ్ వాల్ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలోజోనల్ కమిషనర్ వెంకటేష్, యస్ సి రత్నాకర్, యస్ ఎన్ డి పి కిషన్, ఈ ఈ లాల్ సింగ్ తదితరులు పాల్గోన్నారు. .