24 నుంచి యువగళం……..

రాజమండ్రి,(సిరా న్యూస్);
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ను పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారయినట్లు సమాచారం. నవంబర్ 24 నుంచి లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభించనున్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. స్కిల్ డెవెలప్ మెంట్ కేసులో తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఈ పాదయాత్ర ఆగింది. తిరిగి అక్కడి నుంచే 24వ తేదీ పాదయాత్రను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ యాత్ర ఇచ్చాపురం వరకు వెళ్లాల్సి ఉంది. అయితే పాదయాత్రలో మార్పులు చేసినట్లు సమాచారం. ఇచ్చాపురం బదులు విశాఖలోనే పాదయాత్ర ముగించే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో చంద్రబాబు తన ‘వస్తున్నా మీకోసం పాదయాత్ర’ను విశాఖలోనే ముగించారు. ఇదే సెంట్‌మెంట్‌తో లోకేశ్‌ కూడా విశాఖలోనే ముగించాలని అనుకుంటున్నారు. అదే ఖరారైతే ఆయన పాదయాత్ర పది, 12 రోజులు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేయాల్సిన బాధ్యత లోకేష్‌పై ఉండడంతో ఆయన తన పాదయాత్రను కుదించుకునే యోజనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చంద్రబాబుపై సీఐడీ పోలీసులు మోపిన కేసులకు సంబంధించి, సుప్రీంకోర్టులో మంగళవారం తీర్పు వెలువడ వచ్చని టీడీపీ వర్గాలు ఆశిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *