Shravan Naik in MP Race: ఎంపీ రేసులో న్యాయవాది శ్రవణ్‌ నాయక్‌!?

సిరా న్యూస్, డిజిటల్‌:
ఎంపీ రేసులో న్యాయవాది శ్రవణ్‌ నాయక్‌!?
– ఆదిలాబాద్‌లో కాంగ్రేస్‌ నుండి బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు
– యువనాయకత్వానికి టికెట్‌ ఇస్తే మాత్రం, శ్రవణ్‌ నాయక్‌కు ఖాయం అంటున్న విశ్లేషకులు

తెలంగాణలో అంసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్‌ పార్టి అనూహ్య విజయం సాధించడంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం ఇదే హవా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రేస్‌ పార్టి టిక్కెట్టు వస్తే చాలు, గెలుపు తథ్యమనే ఆలోచనలో ఆశావాహులు ఉన్నారు. అయితే ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం ఎస్టీ రిజర్వ్‌ కావడంతో, ఖానాపూర్‌ నుంచి ప్రముఖ న్యాయవాది శ్రవణ్‌ నాయక్‌ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జన్నారం మండలంలోని ధర్మారం తాండాకు చెందిన ప్రకాశ్‌ రావ్, రేణుక దేవి దంపతుల కుమారుడైన శ్రవణ్‌ నాయక్‌ ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో పాటు జిల్ల ఇంచార్జీ మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌తో పాటు ఇతర పార్టీ సీయర్‌ నాయకులను కలిసి తన ప్రొఫైల్‌ను అందించారు.

20 ఏండ్లుగా పార్టీ సేవలో…
న్యాయవాది శ్రవణ్‌ నాయక్‌ గత 20ఏండ్లుగా కాంగ్రేస్‌లో కొనసాగుతూ, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుపేదలకు అండగా ఉంటూ సామాజిక కార్యకర్తగా మంచి పేరు సంపాదించుకున్నారు. తన తండ్రి స్వర్గీయ ప్రకాశ్‌ రావ్‌ బాటలో నడుస్తూ ప్రజా సేవలో దూసుకెళ్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వం నుంచి మొదలుకొని, రాష్ట్ర, జిల్లా నాయకత్వం వరకు మంచి సత్సంబంధాలు ఉన్న శ్రవణ్‌ నాయక్‌కు ఈ సారి ఎంపీ టికెట్‌ కన్ఫామ్‌ అనే టాక్‌ నడుస్తోంది. ఎన్‌ఎస్‌యూఐ విభాగంలో జాతీయ స్థాయిలో పనిచేసిన ఆయన అనుభం ఇప్పుడు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నరేష్‌ జాదవ్, రేఖా శ్యాంనాయక్, ఆడే గజేందర్‌ తదితరులు ఇప్పటికే పోటీలో ఉన్నప్పటికీ కూడ, యువ నాయకత్వానికి ఎంపీ టికెట్‌ కేటాయించే ఆలోచనలో గనుక పార్టీ అధినాయకత్వం ఉంటే మాత్రం, శ్రవణ్‌ నాయక్‌కు టికేట్‌ తప్పక వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *