సిరా న్యూస్,యాదాద్రి భువనగిరి;
శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని శ్రీ బాలరాముని ప్రాణ ప్రతిష్ట కు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒక్కరికీ మాత్రమే ఆహ్వానం అందింది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపుర. గ్రామంలోని సాయిదత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వామి శ్రీ రామానంద ప్రభుజి కి ఈ ఆహ్వాన పత్రికను శ్రీ రామ తీర్థ క్షేత్ర ప్రాంత ప్రతినిధి తోట భాను, జిల్లా ప్రతినిధి చామ రవీందర్,అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..గత 500 సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు కానీ, ఎక్కడ కూడా హిందువులు వెనకడుగు వేయలేదన్నారు. ఇప్పుడు హిందువుల కలలు సాకారమయ్యాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి తమ ఒక్కరికే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీ బాల రాముని ప్రాణ ప్రతిష్టలలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతమన్నారు. ఈనెల 22న శ్రీ బాల రామ ప్రతిష్ట లో పాల్గొని భారత దేశంలోనీ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని శ్రీరామరాజ్యం కావాలన్నారు. దేశంలో మన సంస్కృతిని సాంప్రదాయాలను సత్యములను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మలరామారం మండలం సంయోజక్ బొమ్మ కంటి మల్లేష్, సహాయ సంయోజక్ కాటం ఐలేశ్,తాడురి రాజు, ప్రజా ప్రతినిధులు , శ్రీరామ భక్తులు పాల్గొన్నారు