సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్యనేతల పై వరుస కేసులు నమోదయవుతున్నాయి. 13వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ జోషి పై ఇంజేజార్ గంజ్ పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. 26వ డివిజన్ కార్పొరేటర్ బాల్నే సురేష్ పై చీటింగ్ కేసు నమోదు అయింది. వీరంతా గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలరేగిపోయారని విమర్శలు వచ్చాయి. అయితే, తమని ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బాధిత కార్పొరేటర్లు ఆరోపించారు.