సిరా న్యూస్,హైదరాబాద్;
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలపై గురువారం మూడవ రోజు విజిలెన్స్ దాడులు కొనసాగాయి. బుధవారం రాత్రి ఒంటిగంట ముప్పై నిమిషాల వరకు తనిఖీలు కొనసాగాయి. అన్నారం, కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన ఫైల్స్ లను మరియు హార్డ్ డిస్క్ ల డాటా మొత్తం స్వాధీనం చేసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన కీలకమైన ఫైల్స్ మరియు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రత్యేక వాహనంలో భద్రత మధ్య ఈ సేకరించిన సమాచారాన్ని హైదరాబాద్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి తరలించారు. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజీ కి సంబంధించిన విచారణలో అత్యంత కీలకమైన సమాచారాన్ని రాబట్టారని సమాచారం. మేడిగడ్డ కు సంబంధించిన భూ సేకరణలో భారీగా అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. బ్యారేజీ నిర్మాణం పనుల్లో జరిగిన అధిక లెక్కల తేడాను గుర్తించినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ ఎస్పి రమేష్ ఆధ్వర్యంలో మహాదేవపూర్ ఇరిగేషన్ డివిజనల్ కార్యాలయంలో ఇంకా దాడులు కొనసాగుతున్నాయి.