సిరా న్యూస్, పెంబి:
అటవీ సంరక్షణ మన అందరి బాధ్యత…
డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రతాప్ నాయక్..
పెంబి మండల రేంజ్ పరిధిలో లోతర్య తండా, గుమ్మిన, గోరు,పెద్దయ్య గూడెం,లో వన్యప్రాణి సంరక్షణ అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై గురువారం రోజున అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రతాప్ నాయక్ మాట్లాడుతూ వన్య ప్రాణులను వేటాడటం, అడవి లో నిప్పు పెట్టడం చిట్టరీత్య నేరం అని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ సంపదను కాపాడటం మన అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ కింగ్ ఫిషర్ లచ్చన్న, బెట్ అధికారులు సంతోష్, ఉదయ్ కుమార్, శివ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.