తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాము లక్ష్మణ్ ఎన్నిక

సిరా న్యూస్,హైదరాబాద్ ;
హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్. టి . జి. పి. ఏ. రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో వ్యవస్థాపకులు, మోతుకూరి యాదయ్య, ఊటుకూరు జాన్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శు. అంబాల ప్రభాకర్, గుడిసె పవన్ కుమార్ గార్ల అధ్యక్షా నా ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం తెల్లారిపల్లి గ్రామానికి చెందిన, పాము లక్ష్మణ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ నూతన సమాజ నిర్మాణానికి మరియు అభివృద్ధికై భావితరాల బంగారు భవిష్యత్తుకు ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలలో పాఠశాలలో చదువుకొని విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్య పోస్ట్కాహారం ఆరోగ్యం మౌలిక సదుపాయాలు కల్పించుటలో ప్రభుత్వంతో ప్రభుత్వం అధికారులతో కలిసి పనిచేస్తానని పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ గార్లు సూచించిన మార్గంలో పే బ్యాక్ టు ద సొసైటీ టైం టాలెంట్ ట్రెజరీలో భాగంగా ఫలాలను అందేలా చూస్తూ ముందుకు సాగుతామని అన్నారు నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఫౌండర్ సభ్యులు శ్రీ మోతుకూరి యాదయ్య శ్రీ ఊటుకూరు జాన్ కుమార్ గార్లకు మరియు రాష్ట్ర అధ్యక్షుడు కార్యదర్శి అంబాల ప్రభాకర్ శ్రీ గుడిసె పవన్ కుమార్ గార్లకు నా ప్రత్యేకమైన జై భీములు తెలుపుకుంటున్నాను ఇట్టి అవకాశం కల్పించినందుకు 2016 నుండి ఖమ్మం జిల్లా టి జి పి ఏ లోపనిచేసిన సభ్యులందరికీ వారి సహకారంతో నాకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం వచ్చినందుకు గాను అహర్నిశలు మన కుటుంబ సంఘం టీజీపీఏ కోసం నిర్వి రా మ o గా కృషి చేస్తానని తెలియజేస్తూ నా తోటి కమిటీ సభ్యులందరికీ నా యొక్క జై భీమ్ తెలుపుతున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *