సిరా న్యూస్, తలమడుగు:
సుంకిడి గ్రామంలో ఘనంగా ఓబన్న జయంతి..
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో గ్రామ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న 217 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి గణేష్ రెడ్డి హాజరై ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా జెడ్పిటిసి గణేష్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో సైరా నరసింహారెడ్డి తో, వడ్డెర ఓబన్న కలిసి బ్రిటిష్ వారితో ప్రాణాలకు తెగించి పోరాడారని అన్నారు, అలాగే వడ్డెర జాతికి తన జీవితాన్ని అంకితం చేసిన ఏకైకవీరుడు వడ్డెర ఓబన్న అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మహేందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్ , వెంకన్న యాదవ్ ,సుంకిడి వడ్డెర సంఘం అధ్యక్షులు అల్లకుంట రాజమల్లు, ఉపాధ్యక్షులు బోర్రన్న, కార్యదర్శి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.