అన్నపూరిణి చిత్రంపై పోలీసులకు పిర్యాదు

సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా సూరారం పి.యస్ లో శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు అన్నపూరిణి చిత్రం పై ఫిర్యాదు చేసి అభ్యంతరము వ్యక్తం చేసార.వారికి హిందూ ధార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. నాస్ స్టూడియోస్ – ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్పై జతిన్ సేథి, ఆర్. రవీంద్రన్ నిర్మించిన సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో నయనతార, జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ అన్నపూర్ణి సినిమా హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీ రాముడిని కించపరిచేలా మరియు బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయి.
హిందువులు ఆహార దేవతగా ఆరాధించబడే ‘అన్నపూర్ణి’ అనే పేరుతో నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటిటి లో అందుబాటులో ఉంది. జనవరి 22 న శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందని ప్రపంచం మొత్తం సంతోషిస్తున్న తరుణంలో ఈ సినిమా మన ప్రభు శ్రీరాముడిని కించపరిచేలా చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా విడుదల చేశారని ఆంధోళన వ్యక్తం చేస్తూ ఈ సినిమా ని నిలిపివేయాలని లేని పక్షం లో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ మా అసోసియేషన్ కార్యాలయాలన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *