సిరా న్యూస్,గోకవరం;
ముందస్తు సమాచారం మేరకు గోకవరం లో వేరు వేరు చోట్ల కోడి కత్తుల తయారీ దారులపై పోలీసులు దాడులు చేసారు. అచ్చియ పేట, బ్రహ్మల కాలనీ లో 500 పైగా కోడి కత్తులను పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ కాగా, ఒకరు పరారీ అయ్యారు. సంక్రాంతికి కోడిపందాల బరులకు గోకవరం పోలీసులు చెక్ పెట్టేందుకు ముందస్తుగా ఆటో అనౌన్స్మెంట్, ప్లెక్సీలు ఏర్పాట్లు చేసారు. కోడి కత్తులు తయారిగాని,కోడిపందాలు గాని నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ ఐ నాగబాబు వెల్లడించారు. సంక్రాంతికి పేకాట, నంబర్ గుండు, అశ్లీల నృత్యా ప్రదర్శనలు కోడిపందాలు వంటివి చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని అయన హెచ్చరించారు.