సిరా న్యూస్, ఆదిలాబాద్:
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకోం…
-ఎమ్మెల్యే పాయల్ శంకర్
+ లారీ ఓనర్లు, వ్యాపారస్తులతో సమావేశం
+ ఎట్టకేలకు ఆదిలాబాద్ లో పున ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు
ఎంతటి వారైనా రైతులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో లారీ ఓనర్లు, పత్తి వ్యాపారస్తులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. లారీల కొరత ఉందంటూ వ్యాపారస్తులు పత్తి కొనుగోలు నిలిపివేయడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 2000 పైగా వాహనాలు మార్కెట్ యార్డ్ ఎదురుగా పత్తిలోడుతో ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు సైతం కలుగుతున్నాయని అన్నారు. కొంతమంది అధికారులు, వ్యాపారస్తులు ఓ మాజీ ప్రజా ప్రతినిధి కను సన్నుల్లో పనిచేస్తూ రైతులకు ఇబ్బందులు కలిగించాలని చూస్తున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అధికారులు తమ తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎట్టకేలకు చర్చలు సఫలం కావడంతో ఆదిలాబాద్ పత్తి మార్కెట్లో కొనుగోలు పునః ప్రారంభమయ్యాయి. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, మార్కెటింగ్ ఏది శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.