సిరా న్యూస్, బోథ్:
మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం
-బోథ్ ఎస్సై రాము
మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని బోథ్ ఎస్సై రాము అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణ కేంద్రంలో జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ పోటీలను బోథ్ ఎస్సై రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… అన్ని వర్గాల వారికి మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు అందించడం సంతోషకరమన్నారు. 2కే రన్ పోటీలు ఆర్మీ, నేవి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సొసైటీ సభ్యులు ఇలానే మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. 2కే రన్ లో మొదటి స్థానం కైవసం చేసుకున్న బాబెర గ్రామం కి చెందిన భీంరావు, రెండవ స్థానంలో నిలిచిన వర్షిత్, మూడవ స్థానం పొందిన శివరాజ్ లకు ఐటీ సభ్యులతో కలిసి బహుమతులు ప్రధానం చేశారు.
