బంధువుల అందోళన
సిరా న్యూస్,హైదరాబాద్;
అబిడ్స్ ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో డాక్టర్స్ నిర్లక్ష్యం తో చిన్నారి మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. హబూబ్నగర్ టౌన్ కు చెందిన సాయికుమార్,అనుషా లకు కుమారుడు జన్మించాడు. నాలుగు రోజులక్రితం అబిడ్స్ ఫెర్నాండెజ్ ఆసుపత్రిలో అనుషా ప్రసవం కోసం అడ్మిట్ అయింది. మూడురోజుల క్రితం బాబుకు జన్మనిచ్చింది. మంచి ఆరోగ్యంగా జన్మించిన బాబు..బుధవారం ఉదయం చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. బంధువులు బాబు మృతికి కారణాలు అడిగారు. మందుల డోస్ ఎక్కువడం వల్లనే మృతి చెందినంట్లు బంధువుల చెబుతున్నారు. ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసారు.