ఫిబ్రవరి 6 లోపు మైనారిటీ గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ మేరాజ్ మహ్ముద్

5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కు దరఖాస్తుల ఆహ్వానం
సిరా న్యూస్,పెద్దపల్లి;
ఫిబ్రవరి 6 లోపు మైనారిటీ గురుకులాలలో ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మొహమ్మద్ మేరాజ్ మహ్ముద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెక్రటరీ, టిఎంఆర్ఈఐఎస్, హైదరాబాద్ ఆదేశాల ప్రకారం, 2024-25 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలలో 5 వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందడం కొరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని 3 మైనారిటీ పాఠశాలల్లో 5వ తరగతిలో రామగుండం మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో మైనార్టీ విద్యార్థులకు 60 సీట్లు, బీసీ- 10, ఎస్సీ-5, ఎస్టీ-3, ఓసీ-2 కలిపి మొత్తం 80 సీట్లకు, పెద్దపల్లి/మంథని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో మైనార్టీ విద్యార్థులకు 30 సీట్లు, బీసీ- 5, ఎస్సీ-2, ఎస్టీ-2, ఓసీ-1 కలిపి మొత్తం 40 సీట్లకు, వీటికి అదనంగా 6,7,8 తరగతులలో మిగిలిన సీట్లకు అలాగే రామగుండం/మంథని మైనారిటీ బాలుర/బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపిసి, బైపిసి కోర్సులకు, పెద్దపల్లి మైనారిటీ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంఈసి, సిఈసి కోర్సులకు (ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్దులు, జైనులు, సిక్కులు, పార్సిలు మాత్రమే) ధరఖాస్తు చేసుకోవచ్చని, ఎలాంటి ఫీజు లేకుండానే ఫిబ్రవరి 6 లోపు ఆన్ లైన్ లో www.tmreis.telangana. gov.in వెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం లేదా స్టడీ సర్టిఫికేట్, కుటుంబ ఆదాయ సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్ అవసరం మేరకు , సెల్ నంబరు,నివాస ధృవీకరణ సర్టిఫికేట్ జత చేయాలని అన్నారు. మైనారిటీ గురుకులాలలో ప్రవేశాలపై ఇతర వివరాలకు పాఠశాలల లేదా కళాశాలల ప్రిన్సిపాళ్లను పెద్దపల్లి గర్ల్స్ స్కూల్ – 7331170848, పెద్దపల్లి గర్ల్స్ కాలేజీ – 9603313883, రామగుండం బాలుర స్కూల్–7331170845, రామగుండం బాలుర కాలేజీ – 9948978628, మంథని గర్ల్స్ స్కూల్ -7995057944, మంథని గర్ల్స్ కాలేజీ- 7995057944 నందు సంప్రదించాలని మొహమ్మద్ మేరాజ్ మహ్ముద్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *